Friday, November 22, 2024

పరీక్షల భయం తగ్గించేందుకు సైకాలజిస్టులు..

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : పరీక్షలు అంటే కొంత మంది విద్యార్థులు భయపడతూ ఒత్తిడికి లోనవుతుంటారు. దాంతో సరిగా చదవరు, చదివినా బుర్ర కెక్కదు. చివరకు పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు సాధించలేరు. ఇలాంటి వారికోసం ఇంటర్‌ బోర్డు క్లినికల్‌ సైకాలజిస్టుల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షలంటే భయం, ఒత్తిడి ఉండే విద్యార్థులు వీరికి ఫోన్‌ చేసి వారి సలహాలు, సూచనలు తీసుకొని పరీక్షలను నిర్భయంగా రాసేలా చర్యలు చేపట్టారు.

మొత్తం ఏడుగురు క్లినికల్‌ సైకాలజిస్టులను నియమించినట్లు ఇంటర్‌ బోర్డు కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ ఈమేరకు తెలిపారు. వీరి ఫోన్‌ నెంబర్‌లు బోర్డు వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement