యుకెలోని బక్లే టౌన్ లో ఓ వింత పరిస్థితి ఎదురైంది. క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వారిపై ఓ సైకో ఉడుత దాడి చేసి గాయపరిచిన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండ్రోజులుగా అది ఆ ఏరియాలో చాలామందిపై అటాక్ చేస్తోందని, దీంతో 18 మందికి తీవ్ర గాయాలైనట్టు స్థానికులు ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ షేర్ చేసుకుంటున్నారు. గ్రెమ్లిన్స్ సినిమాలోని ఓ దుర్మార్గపు క్యారెక్టర్ లెక్కనే ఈ ఉడుత తీరు ఉండడంతో దీనికి స్ట్రైప్ అనే నిక్ నేమ్ కూడా పెట్టారు. ఇది రెండ్రోజులుగా ఫ్లింట్‌షైర్‌లోని బక్లీలో ప్రజలపై దాడి చేస్తున్నట్టు ఓ మీడియా సంస్థ తన కథనంలో వెల్లడించింది.
అయితే.. ఈ ఉడుత అక్కడి లోకల్ బోయ్ అయిన కోరిన్ రేనాల్డ్స్ ని కొరికి గాయపరిచింది. దాంతో అతను ఫేస్ బుక్ లో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ‘‘దానికి నేను రోజూ ఫుడ్ అందించేవాడిని. మా పెరటి తోటలోకి రోజు వస్తుండేది. నాతో చాలా స్నేహంగా ఉండేది. మొదట్లో పక్షుల ఫుడ్ ని దొంగతనంగా తినడానికి వచ్చేది. కానీ, నేను నా చేతిలో గింజలను పట్టుకుని ఉంటే దగ్గరగా వచ్చి నా చేతిలోని గింజలన్నీ మెల్ల మెల్లగా తినేది. కానీ, అనుకోకుండా ఓ రోజు నన్ను అది కొరికి తీవ్రంగా గాయపరిచింది’’ అని రేనాల్డ్స్ తన ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు.
అంతేకాకుండా చాలా మంది ఫేస్ బుక్ లో ఉడుత గాయపరిచిన ఫొటోలను పోస్టు చేశారు. వాటిని చూసిన తర్వాత “‘ఓహ్ మై గుడ్ నెస్, దానికి ఏమైంది?” అని రేనాల్డ్స్ కామెంట్ చేశాడు. “నాకు ఆ ఉడుత తెలుసు కాబట్టి.. దాన్ని పట్టుకునే అవకాశం ఉంది అనుకున్నా. దాదాపు నాతో 20 నిమిషాల సేపు అది ఫుడ్ తింటూ స్పెండ్ చేసేది. కానీ, ఇంతలా జనాలను కొరికి గాయపరుస్తుంది అనుకోలేదు’’ అని రెనాల్డ్స్ పోస్టు పెట్టాడు.
“హెచ్చరిక.. దుర్మార్గపు ఉడుత జనాలపై దాడి చేస్తోంది” అని నికోలా క్రౌథర్ డిసెంబర్ 26న బక్లీ రెసిడెంట్స్ ఫేస్‌బుక్ గ్రూప్‌లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. “నన్ను అది కరిచింది, నా ఫ్రెండ్స్ పై దాడి చేసింది.. చాలా మందిపై ఇట్లాగే దాడి చేస్తోంది. నా ఇంటి పక్కనే ఉండే బెంగాల్ పిల్లలపై కూడా దాడి చేసింది. అని నికోలా తెలిపింది.