పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతున్నది. కొత్తగా పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.100.21కు చేరగా.. డీజిల్ రూ.89.53కు చేరింది. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. నేటి పెరుగుదలతో అన్ని మెట్రో నగరాల్లో ధరలు రూ.100 దాటింది. ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పెట్రోల్ రూ.106.25, డీజిల్ రూ.97.09కు పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి.
మే నెలలో తొలిసారిగా భోపాల్‌లో పెట్రోల్ రూ.100 దాటింది. ఆ తర్వాత జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరునంతపురంలో.. గత నెల చివరి వారంలో చెన్నై, భువనేశ్వర్‌లో రూ.100 మార్క్‌ను చేరింది. ప్రస్తుతం పెట్రోల్ 16 రాష్ట్రాలు, యూటీల్లో వంద దాటింది. డీజిల్ రాజస్థాన్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో డీజిల్ రూ.100 దాటింది. జులైలో ఇప్పటి ఇంధన ధరలు ఐదుసార్లు పెరగ్గా.. మే 4వ తేదీ తర్వాత 37 సార్లు ఇంధన ధరలను చమురు కంపెనీలు పెంచాయి.
ఇది కూడా చదవండి: మినరల్ వాటర్ తాగొచ్చా..?