Tuesday, November 26, 2024

మాతో ఉన్నారో లేదో నిరూపించుకోండి.. నో ఫ్లై జోన్‌ అమలు చేయండి: జెలెన్‌ స్కీ

ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్రసంగానికి ఫిదా అయిన సభ్యులు.. పశ్చిమ దేశాల్లోని పార్లమెంట్‌లో నిలబడి ప్రశంసించారు. అయితే ఈ నేపథ్యంలో.. జెలెన్‌ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. మాతో ఉన్నారో.. లేదో.. రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందని పశ్చిమ దేశాలకు ఆయన విన్నవించారు. రష్యాపై పోరాటాన్ని.. యూరోపియన్‌ ఆదర్శాలను రక్షించే పోరాటంగా అభివర్ణింంచారు. దాని కోసం ఉక్రేనియన్లు గత రెండు దశాబ్దాలలో రెండు రెవెల్యూషన్స్‌ చేపట్టారని గుర్తు చేశారు. ఉక్రెయిన్‌ను విడిచిపెట్టడం లేదని నిరూపించుకోవాలని సూచించారు. యూరోపియన్‌లు ఉక్రెయిన్‌తోనే ఉన్నారని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఫాస్ట్‌ ట్రాక్‌ ఈయూ సభ్యత్వాన్ని అభ్యర్థించిన మరుసటి రోజు జెలెన్‌ స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాము అడవుల్లో, పొలాల్లో, వీధుల్లో పోరాడుతామన్నారు. ఇప్పటికైనా రష్యాపై ఆంక్షలు విధించాలని కోరారు.

ఉక్రెయిన్‌ పౌరులను కాపాడండి
నో ఫ్లై జోన్‌ ప్రకటించాలని జెలెన్‌ స్కీ సూచించాడు. దీంతో ఎంతో మంది ఉక్రెయిన్‌ పౌరుల ప్రాణాలు కాపాడిన వారు అవుతారని విన్నవించుకున్నాడు. నో ఫ్లై జోన్‌ను వెంటనే అమలు చేయాల్సిందిగా జస్టిన్‌ ట్రూడోను జెలెన్‌ స్కీ కోరాడు. పుతిన్‌తో నేరుగా చర్చించేందుకు తాను సిద్ధమని పేర్కొన్నారు. దీని కోసం ముందు రష్యా యుద్ధం ఆపాలని కోరాడు. దేశం వీడిపోవాలని, భద్రతాపరమైన హామీలు ఇస్తే.. పుతిన్‌ కోరుతున్నట్టు నాటో సభ్యత్వ డిమాండ్‌ను పూర్తిగా వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించాడు. నాటో విస్తరణకు రష్యా వ్యతిరేకం అని, తమను చేర్చుకునేందుకు పశ్చిమ దేశాలు సుముఖంగా లేవన్న జెలెన్‌ స్కీ.. రష్యా తక్షణమే యుద్ధం ఆపి వెళ్లిపోవాలని కోరాడు. అందరికీ అంగీకారయోగ్యమైన రాజీ మార్గం ఇదే అని స్పష్టం చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement