స్వదేశంలో ఆందోళనలకు భయపడి మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు పరాయిగడ్డపైనా నిరసన సెగ తప్పలేదు. వాయుసేనకు చెందిన విమానంలో భార్య, ఇద్దరు బాడీగార్డులతో కలిసి గొటబాయ మాలే నగరం చేరుకోవడం తెలిసిందే. అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్న ఆయన ఇప్పటికీ పదవిలోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో గొటబాయ రాజపక్సకు వ్యతిరేకంగా మాల్దీవుల్లోని శ్రీలంక జాతీయులు నిరసనలు తెలియజేశారు. మాలే నగరంలో శ్రీలంక జాతీయ పతాకం చేతబూని గొటబాయకు, శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారు ప్రదర్శన నిర్వహించారు. రాజపక్సను తిరిగి శ్రీలంకకు పంపించివేయాలంటూ డిమాండ్ చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement