Tuesday, November 19, 2024

కోహిమాలో నింగినంటిన నిరసనలు..

నాగాలాండ్ లో ఇటీవల 14మంది పౌరులను ఉగ్రవాదులుగా బావించి పొరపాటున కాల్చి చంపిన ఉదంతంపై కోహిమాలో నిరసనలు వెల్లువెత్తాయి. వరుసగా మూడో రోజు కూడా ఆందోళనలు కొనసాగాయి. శుక్రవారం రోడ్డెక్కిన వేలాదిమంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. ర్యాలీలు, ధర్నాలతో నిరసన తెలిపారు. మాన్ జిల్లాలో సైనిక బలగాల ఎదురుకాల్పుల సంఘటనలపై ఇన్నాళ్లూ ఇతర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆందోళనలు ఇప్పుడు కోహిమాను తాకాయి. రాష్ర్టంలో సైనిక బలగాలకు ప్రత్యేకాధికారాలు కల్పించే ఏఎఫ్ఎస్పీఏ చట్టాన్ని ఉపసంహరించాలని కోరుతూ ఇప్పుడు ఉద్యమం ఊపందుకుంటోంది. నాగాలాండ్ లో పట్టున్న నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యలో శుక్రవారం భారీఎత్తున విద్యార్థులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

మా గొంతుకలను అణచివేయడం కాదు.. ఆ ప్రత్యేక చట్టాన్ని రద్దు చేయండి, దాన్ని వెనక్కుతీసుకునేలోగా మరెందరి ప్రాణాలను బుల్లెట్లు బలిగొంటాయంటూ వారు నినాదాలు చేశారు. అమాయక పౌరుల హత్యకు నిరసనగా మొదట రాష్ర్టంలోని ప్రత్యేక గిరిజన తెగ కొనయాక్ గిరిజన సంఘం సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చింది. బుధవారం నుంచి ఆ సంఘం ఆందోళనలకు పూనుకోగా ఇప్పుడు నాగా స్టూడెంట్స్ యూనియన్ జత కలిసింది. బుధవారం మాన్ జిల్లాలో బంద్ నిర్వహించగా ఇప్పుడు రాష్ర్టంలోని ఇతర ప్రాంతాలకు ఉద్యమం పాకింది. పౌరులను కాల్చి చంపిన సైనికులను అరెస్టు చేయాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement