Friday, November 22, 2024

పెన్షన్‌ సంస్కరణకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లో నిరసనలు.. అనేకమంది అరెస్టు, పలువురు పోలీసులకు గాయాలు

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మాక్రాన్‌ రూపొందించిన పింఛన్‌ సంస్కరణలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనల సందర్భంగా గురువారం అనేక మంది పౌరులు అరెస్టు కాగా, పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జనవరిలో నిరసనలు ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు అత్యంత హింసాత్మక నిరసనల జరిగాయని, 457 మందిని అదుపులోకి తీసుకున్నామని, 441 మంది భద్రతా బలగాలు గాయపడ్డారని ఫ్రాన్స్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్‌ డార్మానిన్‌ తెలిపారు. నిరసనకారులు వీధుల్లో మంటలు రాజేసి, హింసాత్మకంగా తమ నిరనసను తెలిపారు.

పారిస్‌ మార్చ్‌లో అరాచక సమూహాలు చొరబడుతున్నారని పోలీసులు హెచ్చరించారు. ప్రదర్శన చివరి దశలో ప్రదర్శనకారులు ఫేస్‌మాస్క్‌లు ధరించి, వీధుల్లోని చెత్తకి నిప్పు పెట్టారని , పలు నివాసాల కిటీకిలు సైతం అగ్నికి ఆహుతి అయ్యాయి. పార్లమెంట్‌ ఆమోదించిన పెన్షన్ల సంస్కరణను ఉపసంహరించుకోవాలని నిరసనకారులు చేసిన పిలుపులను మంత్రి డర్మానిన్‌ తోసిపుచ్చారు.

హింసాత్మక చర్యలకు పాల్పడితే, చట్టాన్ని ఉపసంహరించుకుంటారని భావించొద్దని, మనం ప్రజాస్వామ్య, సామాజిక చర్చను అంగీకరించాలి. కాని, హింసాత్మక చర్చను కాదని మంత్రి అన్నారు. మద్యం ఎగుమతి హబ్‌లో జరిగిన హింసాత్మక అల్లర్లలో, ప్రదర్శనకారులు బోర్డియక్స్‌ సిటీ హాల్‌ ప్రవేశ ద్వారం అగ్నికి ఆహుతి చేశారు. ఇలాంటి విధ్వంసాన్ని, అర్థం చేసుకోవడం, అంగీకరించడం తనకు కష్టంగా ఉందని బోర్డియక్స్‌ మేయర్‌ పియర్‌ హార్మిక్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement