Friday, November 22, 2024

విద్య కాషాయిూకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 25న ఢిల్లిలో పార్లమెంట్‌ మార్చ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కేంద్రప్రభుత్వం ప్రవేశపట్టిన నూతన విద్యవిధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. నవంబర్‌ 25న ఢిల్లిలో పార్లమంట్‌ మార్చ్‌ నిర్వహించనుట్లు ఆయన తెలిపారు. సోమవారం మగ్దూం భవన్‌లో నూతన విద్యా విధానం రద్దు, భగత్‌ సింగ్‌ నేషనల్‌ ఎంప్లాయిమెంట్‌ యాక్ట్‌ బిల్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్‌ నిర్వహించనున్న పార్లమెంట్‌ మార్చ్‌ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుట్టలక్ష్మణ్‌ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం జాతీయ విద్యావిధానం తీసుకువచ్చి విద్యను ప్రైవేటీకరణ, కాషాయిూకరణ చేయడానికి ప్రయత్నిస్తుందని నిందించారు.

యువతకు స్ఫూర్తి అయిన భగత్‌ సింగ్‌. అంబేద్కర్‌, పెరియార్‌, నారాయణ గురు వంటి వారి జీవిత చరిత్రలను పాఠ్యాంశాల నుంచి తొలగించి బాల్యం నుంచే మతతత్వాలను బోధించేందుకు పాఠ్యప్రణాళికలను రూపొందిస్తున్నారన్నారు. విద్యార్థుల మధ్యవిభజన చేసేందుకు పాఠ్యాంశాల్లో హిజబ్‌ వంటి అంశాలను చేర్చుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.తెలంగాణ విద్యా వ్యవస్థపై మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు. విభజన చట్టంలో ఉన్న గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఇప్పటివరకు ఎందుకు స్థాపించలేదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అలాగే ఖాజీపేటరైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కుపరిశ్రమ ఏర్పాటును మోడీ విస్మరించారని పుట్ట నిందించారు. ఉపాధి హక్కులను కల్పించడానికి భగత్‌సింగ్‌ నేషనల్‌ ఎంప్లాయిమెంట్‌ గ్యారంటీ యాక్ట్‌ బిల్లును తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గ్యార క్రాంతికుమార్‌, రాష్ట్ర నాయకులు ఎండీఅన్వర్‌, హరీష్‌, వంశీ,వినోద్‌, రాజు, శ్రీహరి,వినయ్‌, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement