తంగళ్ళపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిత్యం వేధిస్తున్న పిటీ టీచర్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థినిలు రోడ్డెక్కారు. గురువారం తెల్లవారుజామున సిరిసిల్ల, సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి న్యాయం చేయాలని నినదించారు.
అనంతరం విద్యార్థినిలు మాట్లాడుతూ పిటి టీచర్ జ్యోత్స్న రాము స్నానం చేసేటప్పుడు బాత్రూం డోర్లు పగలగొట్టి చేరవాణిలో చిత్రీకరించి తీవ్రంగా హింసిస్తున్నారని ఆరోపించారు.
సమాచారం అందుకున్న మండల విద్యాధికారి రఘుపతి, సుధాకర్ లు సంఘటన స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థిని లు నిరసన విరమించారు.
- Advertisement -