Friday, September 20, 2024

Protest – లోక్ స‌భ ఆవ‌ర‌ణ‌లో కూర‌గాయాల లొల్లి …

ఉల్లి, కూర‌గాయాల దండ‌ల‌తో విప‌క్షాల ధ‌ర్నా
ద‌ర‌లు త‌గ్గించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్

ఆంధ్ర్ర‌ప్ర‌భ స్మార్ట్ ..న్యూ ఢిల్లీ – దేశంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి . అర‌కొర సంపాద‌న‌తో బతుకు బండి లాగుతున్న సామాన్యులు కూర‌గాయ‌లు కొన‌లేని ప‌రిస్థితి ఏర్పడింది. ఇక ప్రతి వంటలోనూ తప్పనిసరిగా ఉపయోగించే ఉల్లిపాయలు ప్రస్తుతం సామాన్యుల కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి. గ‌త నాలుగైదు నెలల నుంచి ఉల్లి ధ‌ర‌లు పైపైకే వెళ్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ ఉల్లిపాయల ధర రూ.50కిపైనే పలుకుతోంది. కొన్ని చోట్ల రూ.60కి విక్రయిస్తున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో ఉల్లి, ఇతర కూరగాయల ధరల పెరుగుదలపై విపక్ష ఇండియా కూటమి పార్టీల ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు . ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌, డీఎంకే, టీఎంసీ, శివసేన (యూబీటీ) సహా వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు గురువారం ఉదయం పార్లమెంట్‌ ఆవరణలో నిరసన చేపట్టారు. ఉల్లిపాయలతో చేసిన దండలను మెడలో వేసుకుని ధరలు తగ్గించాలంటూ మకర ద్వారం వద్ద నినాదాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement