పార్లమెంట్ సమావేశాల ఇండియా కూటమి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని ఇండియా కూటమి పక్షాల కూటమి నిర్ణయం తీసుకుంది. లోక్ సభలో దాడిపై విపక్షాలు ఉభయ సభలలో గళమెత్తుతున్నారు.. సభా కార్యక్రమాలకు అడగడుగునా అడ్డు తగులుతున్నారు.. దీంతో ఉభయ సభలలోని మొత్తం 91 మంది సభ్యులను సస్పెండ్ వేటు వేశారు.. దీనిని నిరసిస్తూ శీతాకాల సమావేశాలను పూర్తిగా బహిష్కరించాలని కూటమి నిర్ణయం తీసుకుంది విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో భేటీ అయిన ఇండియా కూటమి పక్షాల ఫ్లోర్ లీడర్లు ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే ఇండియా కూటమి నేతల సమావేశం నేటి సాయంత్రం ఢిల్లీలో జరగనుంది.. దీనికోసం కూటమి పార్టీల నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement