Wednesday, January 15, 2025

Protest – హామీలు అమలు కోసం రోడ్డెక్కిన బీఆర్ఎస్

ఆంధ్రప్రభ స్మార్ట్ ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద రూ.15 వేలు ఇచ్చి రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గులాబి పార్టీ నేతలు చేపట్టిన ధర్నా బేల మండల కేంద్రంలో ఉద్రిక్తత‌కు దారి తీసింది. బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నినాదాలు చేశారు.

రైతుల‌ను మోస‌గించిన ప్ర‌భుత్వం
రుణమాఫీ, రైతు భరోసా పేరిట రైతులను ప్రభుత్వం మోసగిస్తుందని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులను అని విధాలా కేసీఆర్ ఆదుకుంటే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అప్పుల పాలు చేసి రైతు కుటుంబాలు ఆర్థిక సంక్షోభాన్ని నింపుతుందని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి పక్షాన నిలబడి పోరాటాలకు సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. దీంతో హైవేపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వారిని రోడ్డుపై నుండి బయటకు లాగే ప్రయత్నం చేయగా కార్యకర్తలు అడ్డుకొని అక్కడే బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు నేతలను అరెస్టు చేసి విడుదల చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో బేల మండల అధ్యక్షుడు కళ్లెం ప్రమోద్ రెడ్డి, నాయకులు గంభీర్ ఠాక్రే, విజ్జగిరి నారాయణ, సతీష్ పవర్, దేవన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement