Saturday, November 23, 2024

ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై నిర‌స‌న‌.. పార్ల‌మెంట్‌లో టీఆర్ ఎస్‌ ఎంపీల ఆందోళ‌న‌

దేశంలో నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు అదుపులో లేవు.. రోజు రోజుకూ ధ‌ర‌లు పెరుగుతుంటూ కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. సామాన్యులు క‌నీసం తిండికి నోచుకునే ప‌రిస్థితులు లేకుండా పోతున్నాయి. మ‌రోవైపు జీఎస్టీ పేరుతో కేంద్రం దోపీడీ చేస్తోంది. ఇక‌.. ద్ర‌వ్యోల్బ‌ణం పెరగ‌డంతో సామాన్యుడి జీవ‌నం అస్త‌వ్య‌స్త‌మ‌వుతోంది.

ధ‌ర‌ల‌ను నియంత్రించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం విఫ‌లం అవుతున్న నేప‌థ్యంలో ఇవ్వాల‌ తెలంగాణ రాష్ట్ర స‌మితి ఎంపీలు పార్ల‌మెంట్‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌కు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు గాంధీ విగ్ర‌హం ముందు ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించి, మోదీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement