Thursday, October 3, 2024

TG: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి నిరసన సెగ..

దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఇటీవల దుబ్బాకలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య వ్యాఖ్యలతో ట్రోలింగ్ చేయడం వెనుక దుబ్బాక బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హస్తముందని ఆరోపిస్తూ దుబ్బాకలో ఎమ్మెల్యే పర్యటనను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు.

ఎమ్మెల్యే కాన్వాయ్ పైన కాంగ్రెస్ నాయకులు కోడిగుడ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల నినాదాలతో దుబ్బాక పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.దుబ్బాకలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో సిఎంఆర్ చెక్కుల పంపిణీ చేసిన తర్వాత స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష సమావేశానికి వెళుతున్న సమయంలో ఈ నిర‌స‌న వ్య‌క్తమైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement