ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ :రైతుల భరోసాపై బీఆర్ఎస్ శ్రేణులు పోరుబాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందంటూ ఆందోళనలకు దిగారు. రైతు భరోసా పై నిరసనలు చేట్టాలని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతుబంధును పూర్తిగా తొలగించే కుట్రలో భాగంగానే మంత్రివర్గ ఉపసంఘం, కొత్త మార్గదర్శకాలు రైతు భరోసా పేరుతో డ్రామాలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. కేటీఆర్ పిలుపుతో…
రాష్ట్రంలో వరంగల్, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల, నిజామాబాద్, మహబూబ్‌బాద్, రాజన్న సిరిసిల్ల, స్యూర్యాపేట, మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, జగిత్యాల జిల్లాల్లో రాస్తారోకోలు నిర్వహించారు. తక్షణమే రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు. సీఎం, మంత్రి తుమ్మల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఆయా జిల్లా నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.