Tuesday, November 26, 2024

ఫిట్‌నెస్‌, లేట్‌ ఫీజు బాదుడుకు నిరసనగా.. ఆటోలు, క్యాబ్‌లు బంద్‌కు పిలుపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు తోడుగా, భరించలేని విధంగా ఫిట్‌నెస్‌ భారం మోపడాన్ని నిరసిస్తూ గురువారం ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్లు ఒక రోజు బంద్‌కు పిలుపునిచ్చారు. అసలే అంతంత మాత్రంగా తమ వృత్తి సాగుతోందని, దీనికి తోడుగా లేట్‌ ఫీజు పేరుతో వాహనదారులపై రోజుకు రూ.50 లు వసూలు చేయడం పట్ల ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్స్‌ యూనియన్‌ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంద్‌లో భాగంగా గురువారం ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి ఆర్టీఏ కార్యాలయం వరకు జేఏసీ ర్యాలీగా వెళ్ళి నిరసనగా ధర్నా చేయాలని నిర్ణయించింది. ఈ ధర్నాలో ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్‌ఎస్‌కేవీ, ఐఎఫ్‌టీయూ, ఐఎన్‌టీయూసీలతో పాటు అన్ని లారీ, క్యాబ్‌, ఆటోయూనియన్లు పాల్గొంటాయని జేఏసీ నేతలు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement