Saturday, November 16, 2024

కృష్ణ జింకలకు రక్షణేది..

ప్రపంచ అందమైన జంతువుల జాబితాలోనున్న కృష్ణజింకలు తెలుగునేలపై తెల్లారి పోతున్నాయి. దేశంలో అరుదైన జంతుజాలాల్లో ఒకటి కృష్ణ జింక(బ్లాక్‌ బక్‌). ఇది రాష్ట్ర అధికార జంతువు కూడా. అటువంటి మన వారసత్వసంపద ఇప్పుడు సరైన రక్షణ చర్యలు లేక గోదావరి వరదల్లో చిక్కుకుని వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. ప్రతి ఏటా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరి నదికి వరదలు రావడం తథ్యం. వీటిని సంరక్షించాల్సిన అటవీశాఖ, వన్య ప్రాణుల సం రక్షణ సమితి ముందు చూపు లేకుండా ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరించడంతో యేటా వరదలకు అనేక జింకలు బలైపోతున్నాయి. ఈ ఏడాది వరద గరిష్ట స్థాయికి చేరుకోవడంతో వందల సంఖ్యలో జింకలు దయ నీయస్థితిలో జలసమాదయ్యాయి. కొన్ని జింకలు కుక్కల దాడులకు గురౌతున్నాయి. మరి కొన్ని రోడ్లమీద భారీ వాహనాల ప్రమాదాల కు బలైపోతున్నాయి.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి గోదావరికి సంభవించబోయే వరద ముప్పు అధికారులు ముందే పసిగట్టారు. కానీ జింకల విషయంలో సంబంధిత యంత్రాంగం అప్రమత్తం కాకపోవడంతో విలువైన జీవ సంపద మృత్యువాత పడుతోంది. కృష్ణ జింకల ఫోటోలను వన్య ప్రాణుల సంరక్షణ సమితి గోదారి తీరాన అక్కడక్కడా హూర్డింగులు పెట్టి చేతులు దులుపుకుంది తప్ప సంరక్షణా చర్యలు కనిపించ డంలేదు. అసలు గోదావరి లంకల్లో ఎన్ని జింకలు న్నాయనే గణాంకాలు కూడా యంత్రాం గం దగ్గర లేకపోవడం నిజంగా నిర్లక్ష్యమే. వరదలే కాకుండా వీటికి వేటగాళ్ళ బెడదా ఉంది. అధికార జంతువని అన్నిచోట్లా దీన్ని రాజస హూయలతో ప్రదర్శిస్తున్నారు కానీ వాటి సంరక్షణ చర్యల్లో మాత్రం అల సత్వమే కనిపిస్తోంది. ఇక నైనా ప్రభుత్వ యంత్రాం గం వాటి ఉనికిని సంరక్షించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement