Tuesday, November 26, 2024

HYD | సెప్టెంబర్‌లో 30 శాతం పెరిగిన ఆస్తి రిజిస్ట్రేషన్లు..

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో సెప్టెంబర్‌ నెలలో ఆస్తి రిజిస్ట్రేషన్లు 30 శాతం పెరిగాయి. మొత్తం 6,185 రెసిడెన్షియల్‌ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగాయని ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంగ్‌ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ తన తాజా నివేదికలో తెలిపింది. వీటి విలువ 3,378 కోట్లుగా ఉందని తెలిపింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే విలువో 42 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది.

హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నాయని తెలిపింది. హైదరాబాద్‌ జోన్‌లో హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు కలిసి ఉన్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్‌లో 4,766 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయని తెలిపింది. సెప్టెంబర్‌లో జరిగిన రిజిస్ట్రేషన్లలో 25 నుంచి 50 లక్షల ధర ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు 51 శాతంగా ఉన్నాయి.

- Advertisement -

25 లక్షల కంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు 15 శాతం మాత్రమే ఉన్నాయి. కోటి రూపాయల కంటే ఎక్కువ విలువ ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు 9 శాతంగా ఉన్నాయి. గత సంవత్సరం వీటి రిజిస్ట్రేషన్లు 8 శాతంగా ఉన్నాయి. 75 లక్షల నుంచి కోటీ రూపాయల విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 8 శాతంగా ఉన్నట్లు నైట్‌ ఫ్రాంక్‌ తెలిపింది.

వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల వైశాల్యం ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు 71 శాతంగా ఉన్నాయి. 500 నుంచి 1000 చదరపు అడుగుల వైశాల్యం ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు కేవలం 14 శాతంగా ఉన్నాయి. 2వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ వైశాల్యం ఉన్న ఇళ్ల రిజిస్ట్రేషన్లు 11 శాతంగా ఉన్నాయి.

గత సంవత్సరం ఇదే కాలంలో ఇవి 9 శాతంగా ఉన్నాయి. జిల్లాల వారిగా చూస్తే హైదరాబాద్‌లో 14 శాతం, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి లో 45 శాతం, రం గారెడ్డిలో 41 శాతం, సంగారెడ్డిలో 11 శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement