Saturday, November 16, 2024

హైదరాబాద్‌లో పెరిగిన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు.. 15 శాతం పెరిగినట్లు నైట్‌ ఫ్రాంక్‌ వెల్లడి

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలో ఆగస్టు నెలలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 15 శాతం పెరిగినట్లు ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టింగ్‌ సంస్థ నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. రిజిస్ట్రేషన్లు సంవత్సరం వారిగా చూస్తే 15 శాతం, నెలవారీగా చూస్తే 17 శాతం పెరిగాయి. ఆగస్టు నెలలో మొత్తం 6,493 రెసిడెన్షియల్‌ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగాయని నైట్‌ ఫ్రాంక్‌ తెలిపింది. వీటి విలువ 3,461 కోట్లుగా పేర్కొంది.

విలువ పరంగా చూస్తే వార్షిక వృద్ధి 22 శాతంగా, నెలవారీ వృద్ధి 20 శాతంగా ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్‌ రెసిడెన్షియల్‌ మార్కెట్‌ పరిధిలో మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి మొత్తం నాలుగు జిల్లాలు కలిసి ఉన్నాయి. రిజిస్ట్రేషన్ల జరిగిన ప్రాపర్టీల్లో 25 నుంచి 50 లక్షల లోపు ఉన్నవి 52 శాతం ఉన్నాయి. 1000 నుంచి 2000 చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ప్రాపర్టీలు 70 శాతం ఉన్నాయి.

2023లో ఇప్పి వరకు మార్చి నెలలో అత్యధికంగా 6,959 ప్రాపర్టీల రిజిస్ట్రేన్లు జరిగాయి. మళ్లి ఆగస్టులో అత్యధికంగా 6,493 ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు తెలిపింది. జులై నెలలో 5,557 ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆగస్టులోజరిగిన రిజిస్ట్రేషన్లలో 25 లక్షల లోపు విలువైన ప్రాపర్టీలు 16 శాతం ఉన్నాయి.

- Advertisement -

25 నుంచి 50 లక్షల లోపు ధర ఉన్నవి 52 శాతం, 50 నుంచి 75 లక్షల విలువైన ప్రాపర్టీలు 16 శాతం, 75 లక్షల నుంచి కోటీ రూపాయల వరకు విలువైన వాటి రిజిస్ట్రేషన్లు 8 శాతం, కోటి నుంచి 2 కోట్ల వరకు విలువైనవి 7 శాతం, రెండు కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్లు 2 శాతం ఉన్నట్లు నైట్‌ ఫ్రాంక్‌ తెలిపింది. హైదరాబాద్‌ జోన్‌లో జిల్లాల వారిగా చూస్తే మేడ్చల్‌- రంగారెడ్డి జిల్లా 43 శాతం రిజిస్ట్రేషన్లతో అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్‌లో 17 శాతం, రంగారెడ్డి జిల్లాలో 39 శాతం, సంగారెడ్డి జిల్లాలో మాత్రం జీరో శాతం నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement