హైదరాబాద్,ఆంధ్రప్రభ : రాష్ట్ర రవాణా శాఖలో డీటీసీలకు జేటీసీలుగా, ఆర్టీఓలకు డీటీసీలుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌గా పదోన్నతులు పొందిన మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, శివ లింగయ్య డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌గా పదోన్నతులు పొందిన రవీందర్ కుమార్, వాణి,సదానందం,కిషన్, సురేష్ రెడ్డిలు గురువారం మంత్రి నివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు.
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో సాధ్యమయ్యాయన్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ కుమార్, తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్షుడు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భం గా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. వాహనదారులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు రహదారి భద్రతను పెంపొందించడానికి రవాణా శాఖ అధికారులు కృషి చేయాలని మార్గ నిర్దేశనం చేశారు.