హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న టీచర్ల పదోన్నతుల అంశం ఇక పరిష్కారం కానుంది. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 11 వేల ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను ఈరోజు (శనివారం) అసెంబ్లి వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ పదోన్నతులను మేనేజ్‌మెంట్ల వారీగా ఇచ్చే అవకాశం ఉంది. సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ)గా ఉన్న వారికి ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్లు (ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం)గా, స్కూల్ అసిస్టెంట్లు(ఎస్‌ఏ)గా ఇవ్వడంతో పాటు, స్కూల్ అసిస్టెంట్స్‌గా ఉన్న వారికి గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా పదోన్నతులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్లకు సంబంధించిన అంశంపై విద్యాశాఖ అధికారులతో విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం సమావేశమయ్యారు.
ఈ పదోన్నతుల ద్వారా సుమారు 10,500 నుంచి 11 వేల మంది టీచర్లు పదోన్నతులు పొందే వీలుంది. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ కొద్ది రోజుల క్రిత వనపర్తిలో జరిగిన బహిరంగ సభతోఒపాటు, అసెంబ్లిలోనూ ఇటీవల ప్రకటిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లిలో బడ్జెట్ పద్దులపై జరిగే చర్చలో భాగంగా విద్యాశాఖ మంత్రి ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విద్యా రంగ సమస్యలపై ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు మంత్రి ఈమేరకు సమాధానం ఇవ్వనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..