Thursday, November 7, 2024

TG | 83మంది డిప్యూటీ తాహశీల్దార్‌లకు పదోన్నతి

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ :రాష్ట్రంలో 83 మంది డిప్యూటీ తహశీల్దార్లకు తహసీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం, రెవెన్యూ మంత్రి, సీసీఎల్‌ఏకు టీజీటీఏ ధన్యవాదాలు తెలిపింది.

తెలంగాణ ఉద్యోగుల చైర్మన్‌ లచ్చి రెడ్డి, టీజీటీఏ కృషి ఫలితంగానే డీటీలకు తహశీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించిందని తెలంగాణ తహశీల్దార్స్‌ అసోసియేషన్‌ హర్షం వ్యక్తం చేసింది. గతంలోనూ పదోన్నతులను ఇప్పించిన చరిత్ర టీజీటీఏకే ఉందన్నారు.

ఈ మేరకు తెలంగాణ తహశీల్దార్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ రాములు, ప్రధాన కార్యదర్శి రమేశ్‌ పాక, సెక్రటరీ జనరల్‌ ఫూల్‌సింగ్‌ చౌహాన్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు రాధ, సీఎం రేవంత్‌, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డికి, సీసీఎల్‌ఏ నవీన్‌ మిట్టల్‌కి, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ లచ్చిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూసే డీటీలకు తహశీల్దార్లుగా అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement