హైదరాబాద్, ఆంధ్రప్రభ: జరగనున్న అసెంబ్లి ఎన్నికల దృష్ట్యా జంట నగరాల్లో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు హైదరాబాద్ నగరంలోని 15 నియోజకవర్గాలకు చెందిన రిటర్నింగ్ కార్యాలయాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు నగర సిపి సందీప్ శాండిల్య ప్రకటించారు. ఈ నిబంధనలు నవంబర్ మూడు నుంచి 15వ తేదీ వరకు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అమలులో ఉంటాయని తెలిపారు.
అప్పటి వరకు ఐదుగురి కంటే ఎక్కువ మంది ఉండటాన్ని నిషేధించారు. శాంతి, భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల బరిలో పోటీ పడనున్నవారు కింద గల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలను గర్తుంచుకోవాలని సూచించారు.
1. ముషీరాబాద్ (57), తహశీలు కార్యాలయం, ముషీరాబాద్, లోయర్ ట్యాంక్‌బండ్, హైదరాబాద్.
2. మలక్‌పేట్ (58), డిప్యూటీ కమీషనర్, పర్కిల్ 6, మలక్‌పేట్, జిహెచ్‌ఎంసి నేషనల్ పార్క్, డెఫ్ అండ్ డంబ్ స్కూల్ పక్కన, నల్గొండ క్రాస్ రోడ్స్, హైదరాబాద్.
3. అంబర్‌పేట్ (59), తహ్‌శీల్ కార్యాలయం, అంబర్‌పేట్, హైదరాబాద్.
4. ఖైతాబాద్ (60), జోనల్ కమీషనర్ కార్యాలయం, గ్రౌండ్ ఫ్లోర్, ఖైరతాబాద్, హైదరాబాద్.
5. జూబ్లిహిల్స్ (61), తహ్‌శీల్ కార్యాలయం, షేక్‌పేట్ బంజారాహిల్స్, హైదరాబాద్.
6. సనత్‌నగర్ (62), డిప్యూటీ కమీషనర్, బేగంపేట్ సర్కిల్ 30, మూడవ అంతస్తు, జోనల్ కమీషనర్ కార్యాలయం, సికింద్రాబాద్.
7. నాంపట్లి (63), తహశీలు కార్యాలయం, ఆసిఫ్‌నగర్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్.
8. కార్వాన్ (64), తహశీలు కార్యాలయం, గోల్కొండ, హైదరాబాద్.
9. గోషామహల్ (65), నాల్గవ అంతస్తు, జిహెచ్‌ఎంసి కాంప్లెక్స్, ఆబిడ్స్, హైదరాబాద్.
10. చార్మినార్ (66), చార్మినార్ మొఘల్‌పురా స్పోర్ట్స్ కాంప్లెక్స్, మొదటి అంతస్తు, చార్మినార్, హైదరాబాద్.
11. చాంద్రాయణ గుట్ట (67), తహశీలు కార్యాలయం, బండ్లగూడ, హైదరాబాద్.
12. యాఖుత్‌పురా (68), తహశీలు కార్యాలయం, సయీదాబాద్, చంపాపేట్ రోడ్డు, హైదరాబాద్.
13. బహాదూర్‌పురా(69), తహశీలు కార్యాలయం, హైదరాబాద్.
14. సికింద్రాబాద్ (70), జోనల్ కమీషనర్ కార్యాలయం, మొదటి అంతస్తు, సికింద్రాబాద్ జోన్, మారెడ్‌పల్లి, హైదరాబాద్.
15. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (71), చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి కార్యాలయం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్, కోర్ట్ హౌజ్ కాంపౌండ్, ఎస్‌పి రోడ్డు, సికింద్రాబాద్.