హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆరుదశాబ్దాల దక్షిణ తెలంగాణ ప్రజల నీటి గోస తీరే గడియలు ఆసన్నమవుతున్నాయి. ఏపీ సృష్టించిన అడ్డంకులను అధిగమించి సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఐదు ప్రధాన జలాశయాల పనుల్లో పురోగతి ఉండటంతో పాటుగా ఎదుల, వ్టటెం, కరివెన రిజర్వాయర్ల నిర్మాణపనులు దాదపుగా పూర్తి కావస్తుండగా ఎదుల రిజర్వాయర్ జూలై లో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో పాలమూరు లోని కరువుపీడిత వలసప్రాంతాలకు నీటి సమస్యపరిష్కారం అవుతుందని అధికారులు అంచెనావేశారు. ఏదుల పంపుహౌజ్ విద్యుత్ లైన్లు, పంపుహౌజ్ మోటర్ల ఏర్పాటు పూర్తి కావడంతో పంపులను వెట్ రన్ చేసి పరిశీలించారు.
నల్గొండజిల్లాలోని 400 కెవి.సబ్ స్టేషన్ నుంచి ఏదుల పంపు హౌసుకు విద్యుత్ సరఫరాఅవుతోంది. ఏదుల రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి కావస్తుండటంతో ఈ పథకం కీలకఘట్టానికి రంగం సిద్ధమైంది. సర్జిపూల్ నిర్మాణం చివరి దశలో ఉండటంతో త్వరలో ఎత్తిపోతలకు ఏదుల సిద్ధమవుతుంది. ఏదుల రిజర్వాయర్ నుంచి 29 కి.మీ ఓపెన్ కెనాల్ నిర్మాణ పనులు కూడపూర్తి అవుతున్నాయి. ఏదుల రిజర్వాయర్ కట్టపొడవు 7.716 కిలోమీటర్లు ఉండగా 6.55 టీఎంసీల నీటి సామర్ధ్యంతో నిర్మాణం జరుగుతుంది. ఈ రిజర్వాయర్ ఉమామహేశ్వరం ఎత్తిపోతలకు అనుసంధానం చేసి ఎగువప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందివ్వనున్నారు.
అలాగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కు సంబంధించిన 5 రిజర్వాయర్ల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. సముద్రమట్టానికి 269.735మీటర్ల ఎత్తులోకి కృష్ణా జలాలను 5దశల్లో ఎత్తిపోయడమే ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ ప్రాజెక్టు ద్వారా నాగర్కర్నూల్ జిల్లాలో లక్షా 3వేల ఎకరాలు, మహబూబ్ నగర్ జిల్లాలో 2లక్షల 35వేల ఎకరాలు, వికరాబాద్ లో 3లక్షల 42 వేలు, నారాయణపేట్ లో లక్షా 6వేలు, రంగారెడ్డి జిల్లాలో 3లక్షల 59వేలు నల్గొండ లక్షా 30వేల ఎకరాలు సాగులోకి రావడంతో పాటుగా 12 వందల గ్రామాలకు తాగునీరు అందనుంది. 21 ప్యాకేజీలుగా ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి అంచనావ్యయం 22వేల 935 కోట్లు. అయితే ఇప్పటివరకుసుమారు కేటాయయించిన బడ్జెట్ లో 75 శాతం నిదులతో పనులు పూర్తి అయ్యాయి.
గడువులోగా పనులు పూర్తి అవుతాయి..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సిీఈ హమీద్ ఖాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు నిర్ణీత గడువు లోగా పనులు పూర్తి చేయనున్నట్లు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సీఈ హమీద్ ఖాన్ చెప్పారు. నార్లాపూర్, ఎదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల పనులు పురోగతిలో ఉండగా ఏదుల, ఉద్దండాపూర్, కరివెన పనులు వేగవంతంగా పూర్తి అవుతున్నాయని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకం ద్వారా తొలిదశలో ప్లోరైడ్ పీడత ప్రాంతాలు, కరువు పీడిత ప్రాంతాల్లో తాగునీరు అందివ్వనున్నట్లు చెప్పారు. జూలై, ఆగస్టులోగా ప్రభుత్వం ఆదేశించిన పనులు పూర్తి కానున్నాయని చెప్పారు.