Tuesday, November 19, 2024

రెండోరోజూ లాభాలు.. 428 పాయింట్లు ప్రాఫిట్స్ లో సెన్సెక్స్‌

ముంబయి:వరుసగా రెండో రోజూ స్టాక్‌మార్కెట్‌ లాభాలు చవిచూసింది. అటు సెన్సెక్స్‌, ఇటు నిఫ్టీ జోరు కొనసాగింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 427.5 పాయింట్లు లాభపడి 54,178.5 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 16,133వద్ద ముగిసింది. మొత్తంమీద నిఫ్టీ 143 పాయింట్లు, అంటే 0.89 శాతం మేర లాభపడింది. గురువారం మొత్తంమీద ఒక దశలో సెన్సెక్స్‌ 52,255, నిఫ్టీ 16,151 వరకు తాకినప్పటికీ ఆ తరువాత మార్పులు చోటుచేసుకున్నాయి. సెన్సెక్‌ పరిథిలోని 30, నిఫ్టీ పరిధిలోని 50 సంస్థలకు అనుకూలంగా మార్కెట్లు స్పందించాయి.

హిండాల్కో, టైటాన్‌, టాటా స్టీల్‌, ఎల్‌ అండ్‌ టి, టాటా మోటార్స్‌, జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, యూపీఎల్‌ ఇండస్‌ బ్యాంక్‌ స్టాక్స్‌ విలువ 3 నుంచి 6 శాతం మేర పెరిగింది. కాగా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సిప్లా, బజాజ్‌ ఫైనాన్స్‌, భారతి ఎయిర్‌టెల్‌, నెస్లే ఇండియా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌యుఎల్‌ షేర్లు 1 శాతం మేర పతనమైనాయి. కాగా నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3.4 శాతం మేర పెరగ్గా, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 0.08 శాతం మేర పెరిగింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement