Thursday, November 21, 2024

దేశీయ ఉక్కు కంపెనీలకు లాభాలు పెరగవచ్చు.. డిసెంబర్‌ త్రైమాసికంలో పెరిగిన డిమాండ్‌

దేశంలో ఉక్కు కంపెనీలు సెప్టెంబర్‌ త్రైమాసికంలో సవాళ్లు ఎదుర్కొన్నాయి. ప్రస్తుత డిసెంబర్‌ త్రైమాసికంలో పరిస్థితులు కంపెనీలకు అనుకూలంగా మారే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు. డిమాండ్‌ పెరగడం, తయారీ ఖర్చులు తగ్గడం వల్ల కంపెనీల లాభాలు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఉక్కు కంపెనీల ఆర్ధిక ఫలితాలు నిరాశపరిచాయి. ఉక్కు ధరలు తగ్గడం, కోకింగ్‌ ఓల్‌, ఇతర ముడి వస్తువుల ధరలు భారీగా పెరగడం వంటి వాటితో ప్రతికూల ప్రభావం పడింది. ఈ త్రైమాసికంలో కోకింగ్‌ కోల్‌ ధరలు తగ్గడంతో ఉక్కు కంపెనీల లాభాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రతికూల మార్కెట్‌ పరిస్థితుల వల్ల జులై-సెప్టెంబర్లో అగ్రగామి 5 ఉక్కు కంపెనీలు నష్టాన్ని , లేదా లాభంలో క్షిణతను ప్రకటించాయి. ఈ ఐదు పెద్ద కంపెనీలకు దేశీయ ఉక్కు మార్కెట్‌లో 60 శాతం వాటా కలిగి ఉన్నాయి. సాధారణంగానే ఉక్కు కంపెనీలకు సెప్టెంబర్‌ త్రైమాసికం బలహీనంగా ఉంటుందని, తయారీ ఖర్చులు పెరగడం, ఉక్కు ధరలు తగ్గడం వల్ల కంపెనీల ఆర్ధిక ఫలితాలు నిరుత్సాహపరిచాయని మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కౌస్తుభ్‌ చౌభల్‌ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వాహనాలకు డిమాండ్‌ పెరుగుతుందటం, మౌలిక సదుపాయల కల్పనకు ప్రభుత్వ ఖర్చు పెరగడం కలిసి వస్తుందని భావిస్తున్నారు. గతంలో సరఫరాల్లో సమస్యల వల్ల ముడి సరకుల ధరలు పెరిగాయి. ఈ పరిస్థితి ఇకపై పెద్దగా ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు. మరో వైపు డిమాండ్‌ పెరుగుతుండటం వల్ల ఉక్కు ధరలు పెరిగే అవకాశం ఉందని అక్యూట్‌ రేటింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ చీఫ్‌ అనలిటికల్‌ ఆఫీసర్‌ సుమన్‌ చౌద్రీ అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement