తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ శ్వాసగా.. తెలంగాణే ధ్యాసగా జయశంకర్ సార్ నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మీరు గడిపిన జీవితం మహోన్నతం.. స్వరాష్ట్రంలో తెలంగాణ సాగిస్తున్న ప్రగతి ప్రస్థానం సాక్షిగా.. మీకివే మా నివాళులు.. జోహార్ Prof. జయశంకర్ సార్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
నాకు ఇష్టమైన ఫేవరెట్ పిక్చర్లలో ఇది ఒకటి
జయశంకర్ సార్‌తో దిగిన కొన్ని ఫోటోల్లో ఇది నా ఫేవరెట్ పిక్ అని తెలుపుతూ కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. 2009, నవంబర్ 29న అలుగనూరు వద్ద కేసీఆర్‌ను అరెస్టు చేసిన అనంతరం.. జయశంకర్ సార్, నేను నేరుగా హనుమకొండలోని ఆయన ఇంటికి చేరుకున్నాం. ఆ తర్వాత రోజు ప్రొఫెసర్‌ణు అరెస్టు చేసి ఖమ్మం జైలుకు, నన్ను వరంగల్ జైలుకు తరలించారు అని కేటీఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.