Tuesday, November 26, 2024

పెరగనున్న ప్రొఫెషనల్‌ కోర్సుల ఫీజులు.. ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ,ఎల్‌ఎల్‌బీ ఇతర కోర్సులపై ప్రభావం పడే అవకాశం..

రాష్ట్రంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, బీఆర్క్‌, బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఫార్మ్‌డి, ఎంబీఏ, ఎంసీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, బీఈడీతో సహా పలు వృత్తి విద్యా కోర్సుల ఫీజులు పెరగనున్నాయి. ఈ పెంచే ఫీజులు 2022-23 విద్యా సంవత్సరం నుంచి 2024-25 వరకు విద్యా సంవత్సరాలకు అమలు కానున్నాయి. ప్రొఫెషనల్‌ కోర్సులు అందించే కాలేజీల ఫీజుల సవరణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) జారీ చేసింది. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న వృత్తి విద్యా కోర్సుల ఫీజులు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీఏఎఫ్‌ఆర్‌సీ గతంలో నిర్ణయించిన ఫీజుల గడువు ముగుస్తుండటంతో రానున్న మూడేళ్లకు (బ్లాక్‌ పిరి యడ్‌) కొత్త ఫీజులను నిర్ణయించనున్నారు. ఈమేరకు ఫీజుల సవరణకు సంబంధించి ప్రైవేట్‌ కాలేజీల నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖా స్తులను స్వీకరించనున్నారు. ప్రొఫెషనల్‌ కోర్సుల ఫీజులను ప్రతి మూడేళ్లకోసారి (బ్లాక్‌ పిరియడ్‌) టీఏ ఎఫ్‌ఆర్సీ నిర్ణయిస్తోంది. ఈ అకాడమిక్‌ ఇయర్‌తో 2019-22 బ్లాక్‌ పిరియడ్‌ పూర్తి కానుంది.

దీంతో వచ్చే 2022-23 నుండి 2024- 25 వరకు మూడేళ్లకు కొత్తగా ఫీజులను నిర్ణయించనున్నారు. ఫీజు సవరణను కోరుకునే ప్రొఫెషనల్‌ కాలేజీల మేనేజ్‌ మెంట్‌లు 20 20- 21 విద్యా సంవత్సరానికి సంబంధించి తమ ఆడిట్‌ చేసిన ఆర్థిక నివేదికతో పాటు 2019-20 సంవత్సరానికి సంబంధించిన వివరాలను సైతం టీఏఎఫ్‌ ఆర్సీకి సమర్పించాల్సి ఉంటుంది. కళాశాల మేనేజ్‌ మెంట్‌లు చేసే ఖర్చు, సౌకర్యాలు, వసతులు, మౌలిక సదుపాయాలు మొద లైన వాటి ఆధారంగా కమిటీ ఫీజును నిర్ణయిస్తుంది. ఫీజు పెంపు కోరుకునే కాలేజీలు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అయితే ఎంబీబీఎస్‌, డెంటర్‌ కోర్సులు మినహా ఎఫ్‌ఆర్సీ పరిధిలోని అన్ని ఇతర కోర్సులకు ఫీజును నిర్ణయించనుంది. ఎంబీబీఎస్‌ డెంటల్‌ కోర్సులకు సంబంధించిన ఫీజు సవరణ నోటిఫికేషన్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

గతంలో 20 శాతం పెంపు…

ప్రధానంగా ఇంజనీరింగ్‌, ఫార్మసీ, ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ కోర్సుల ఫీజుల నిర్ణయంపైనే అందిరి దృష్టి నెలకొంది. గత బ్లాక్‌ పిరియడ్‌లో టీఏ ఎఫ్‌ఆర్సీ ఇంజనీరింగ్‌ ఫీజును కనీసంగా రూ.35 వేలు, అత్యధికంగా రూ.1.34 లక్షలుగా ప్రకటించింది. ఆ పిరియడ్‌లో ఫీజులు దాదాపు 20 శాతం వరకు పెరిగాయి. ఈసారి పెంచే ఫీజులు అన్ని కాలేజీల్లో ఒకేలా ఉండే పరిస్థితి లేదు. ఏ కాలేజీకు ఆ ఫీజు ఉంటుంది. కాలేజీల ఆదాయ, వ్యయ, వసతుల ఆదారంగానే ఫీజులను ఖరారు చేయనున్నారు. కాలేజీలు అందించిన వివరాలను పరిశీలించి ఆయా కోర్సుల్లో ఫీజులను ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు. ఆ తర్వాత దీనిపై సర్కారు అ ఉత్తర్వులు ఇవ్వనుంది. అయితే అటు విద్యా రంగంపై ఇటు ప్రజలపై కరోనా ప్రభావం ఉండడంతో కోర్సుల ఫీజులు స్వల్పంగానే పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement