న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ సస్యశామలమైందని, అభివృద్ధి జరుగుతోందని టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కొనియాడారు. శనివారం ఢిల్లీ తెలంగాణ భవన్లో జయశంకర్ 88 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ఎంపీలు జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నాథం, ఎంపీలు సంతోష్ కుమార్, దామోదర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, వెంకటేష్ నేత, సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, రాములు, పసునూరి దయాకర్, బడుగుల లింగయ్య యాదవ్, భవన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… జయశంకర్ తెలంగాణ రాష్ట్రం కోసం రెండు దశాబ్దాలు సీఎం కేసీఆర్తో కలిసి పనిచేశారని గుర్తు చేశారు. జయశంకర్ కేసీఆర్కు చేదోడు వాదోడుగా ఉంటూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సామాజిక న్యాయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
ఢిల్లీ తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి వేడుకలు.. పాల్గొన్న టీఆర్ఎస్ ఎంపీలు
- Advertisement -
Advertisement
తాజా వార్తలు
Advertisement