భారత్‌లో సెప్టెంబర్ నుంచి పూర్తిస్థాయిలో స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) తెలిపింది. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో సహా ఐదు కంపెనీలు స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ ఉత్పత్తిలో భారత్ ప్రధాన వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రంగా మారుతోందని పేర్కొంది. దీంతో పాటు రెండో బ్యాచ్ కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిలో ఎలాంటి జాప్యం లేదని ఆర్‌డీఐఎఫ్ స్పష్టం చేసింది.
భారత్‌లోని భాగస్వామ్య కంపెనీల సాయంతో రెండో బ్యాచ్ ఉత్పత్తి జరుగుతున్నది పేర్కొంది. ఇందుకు సంబంధించి రష్యా, భారత్ లోని వ్యాక్సీన్ ఉత్పాదక కంపెనీల మధ్య ఒప్పందపు సంతకాల ప్రక్రియ జరగనున్నదని తెలిపింది. దీంతో పాటు ఆగస్ట్ నుంచి భారత్‌లో స్పుత్నిక్-వీ తోపాటు స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ సరఫరాను వేగవంతం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వివరించింది.
ఈ వార్త కూడా చదవండి: 6వ తరగతి బాలుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ గేమ్