జయప్రదను మార్చి 6లోపు కోర్టులో ప్రవేశపెట్టాలని యూపీలోని రామ్‌పుర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రామ్‌పుర్ ఎంపీగా పనిచేసిన జయప్రదపై 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ కేసులు నమోదయ్యాయి. ఆ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీచేసిన జయప్రద సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆజంఖాన్ చేతిలో ఓటమిని చవిచూశారు.
- Advertisement -
ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసుల్లో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినా ఆమె బేఖాతరు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు జయప్రద అరెస్టుకు రామ్‌పుర్ ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల్లో మాజీ ఎంపీ, సినీనటి జయప్రదను ‘పరారీ’లో ఉన్న వ్యక్తిగా ప్రకటించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని రామ్‌పుర్ కోర్టు. ఆమెను అరెస్టుచేసి, మార్చి 6వ తేదీలోపు తమ ముందు హాజరుపరచాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.