తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రులకు వారంలోగా 4 లక్షలకు పైగా రెమిడెసివిర్ ఇంజక్షన్లు అందేలా చూస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం రెమిడెసివిర్ ఉత్పత్తిదారులతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపారు. సీఎం ఆదేశాల మేరకు ఉత్పత్తిదారులతో చర్చించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత పెరిగింది. వైరస్ సోకి శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు తలెత్తుతున్న వారికి వైద్యులు ఆక్సిజన్‌తో పాటు రెమిడెసివిర్ ఇంజక్షన్లను ఇస్తున్నారు. ఫలితంగా వైరస్ లోడ్ తగ్గి రోగులు త్వరగా కోలుకుంటున్నట్టు చెబుతున్నాయి. ఇటీవల ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్యతోపాటే రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగం సైతం పెరిగింది. ఉత్పత్తి తగ్గడం.. చాలా చోట్ల ఇంజక్షన్లు లభించకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఉత్పత్తి పెంచాలని తయారీ సంస్థలతో మంత్రి కేటీఆర్ బుధవారం నాడు చర్చలు జరిపారు.
వారంలో 4 లక్షల రెమిడెసివిర్ ఇంజక్షన్లు: కేటీఆర్
By ramesh nalam
- Tags
- breaking news telugu
- government hospitals
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- MINISTER KTR
- Most Important News
- remdesivir
- telangana
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu trending news
- viral news telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement