కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసిన స్థానానికి ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ పోటీలో ప్రియాంక గాంధీ భారీ విజయం సాధించారు. ఆమె 3.82 లక్షల ఓట్ల మెజార్టీని పొందారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. ఈరోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇక్కడ పోటీ చేసిన ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలిచారు.
రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి తన సభ్యత్వాన్ని నిలుపుకుంటూ వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. అందుకే రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ ఇక్కడ జరుగుతున్న ఉపఎన్నికలో మొదటిసారి పోటీ చేశారు. మొదటిసారి పోటీ చేసినా ఆమె ఘన విజయం సాధించారు.
- Advertisement -