హైదరాబాద్ – సరూర్‌నగర్ యువ సంఘర్షణ సభకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ సోమవారం మధ్యాహ్నాం 3:30 గంటలకు హైదరాబాద్‌కు రానున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించుకుని ఆమె ప్రత్యేక విమానంలో బేగంపేట ఏయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. బేగంపేట ఏయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో సభా స్థలికి చేరుకుంటారు. నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించాక సభలో దాదాసే అరగంట సేపు రాష్ట్రంలోని పరిస్థితులపైన మాట్లాడనున్నారు. ఎల్బీనగర్ చౌరస్తాలో ఉన్న తెలంగాణ అమరుడు శ్రీకాంత చారి విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సరూర్‌నగర్ స్టేడియానికి శ్రీకాంతాచారి పేరు పెడుతామని ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కాగా సభా ముగిసిన అనంతరం ప్రియాంక గాంధీ సభా స్థలినుంచి హెలికాప్టర్‌లో బేగంపేట ఏయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 6 గంటలకు తిరిగి ఢిల్లికి వెళ్లనున్నారు. ప్రియాంక సభకు వచ్చిన తర్వాత టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాత్రమే మాట్లాడే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ప్రియాంక గాంధీ సభాస్థలికి చేరుకోక ముందే కొందరు సీనియర్లు మాట్లాడేలా చూస్తున్నారు.
ప్రియాంక టూర్ షెడ్యూల్ ఇదే! ..
Advertisement
తాజా వార్తలు
Advertisement