Tuesday, November 19, 2024

సినీరంగంలో ప‌డిన క‌ష్టాలు.. స‌మ‌స్య‌ల గురించి చెప్పిన ప్రియాంక‌చోప్రా

సినీ రంగ‌లో చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న‌ట్లు చెప్పింది గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక‌చోప్రా. 2002 లో సన్నీడియోల్ హీరోగా వచ్చిన ద హీరో సినిమాతో తెరంగేట్రం చేసింది బ్యూటీ.. ఎన్నో టఫ్ సిట్యుయేషన్స్ ను ధైర్యంగా ఎదుర్కొని ఇంతటి స్థాయికి ఎదగలిగానని ..ఎలాంటి పరిస్థితి వచ్చినా.. ఎవరు తనను తొక్కేయాలని చూసినా.. అది జరిగే పని కాదు.. తనను ఏ శక్తి ఆపలేదని ఆమె స్పష్టం చేసింది . తనకు చాలా ఈజీగా అవకాశాలు రాలేదంటోంది ప్రియాంక. నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన రోజుల్లో తను చాలా అవమానాలు అనుభవించానంటోంది బ్యూటీ. తనను డస్కీ అంటూ పిలిచేవారని.. అలా ఎందుకు పిలుస్తున్నారో అర్ధం కాలేదంటుంది. అంతే కాదు. సెట్ లో చాలా మంది కోసం తనను వెయిటింగ్ లో పెట్టావారంటోంది ప్రియాంక.

తనను నల్లపిల్లీ అంటూ వెంటకారంగా పిలిచేవారని..రకరకాలుగా తనను అవమానించారని.. తన కలర్ వల్ల చాలా మాటలు పడ్డానంటోంది. అంతే కాదు గంటల తరబడి తనను వెయిటింగ్ చేయించేవారంటూ అప్పటి అనుభవాలు వెల్లడించింది ప్రియాంక. అంతే కాదు వాటి నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం ఆత్మవిశ్వాసంతో పనిచేశానంటోంది ప్రియాంక.ఇక్కడ కొందరు తన టాలెంట్ ను తనఫిల్మ్ కెరీర్ ను చంపేయడానికి చాలా ట్రై చేశారని సంచలన విషయాలు తెలిపింది. అంతేకాదుఇక్కడ తనకు పని దొరకకుండా ఇండస్ట్రీ నుంచి బయటకు పంపాలని విశ్వ ప్రయత్నాలు చేశారని బాధపడింది ప్రియాంక. కాగా ప్రియాంక చోప్రా మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి . అంతేకాదు కొందరు ఆమె మాటల పై ఫైర్ అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement