ప్రభుత్వ రంగ కంపెనీల్లో పెట్టుబడుల ఉప సంహరణ ప్రక్రియను కేంద్రం వేగం చేస్తున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటీకరణ ప్రక్రియ ద్వారా.. రూ.70వేల కోట్లు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జూన్‌లో ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రక్రియ వేగం పుంజుకోనుంది. ఐటీసీ, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కంపెనీల్లో ఉన్న పెట్టుబడులను ఉప సంహరించుకునేందుకు కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభించినట్టు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రక్రియ పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకున్నట్టు తెలుస్తున్నది. మూడో త్రైమాసికంలో (అక్టోబర్-నవంబర్-డిసెంబర్) ఐటీసీ, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌ను ప్రైవేటీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది.
హిందుస్థాన్‌లో 29.54 శాతం వాటా
హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌లో కేంద్ర ప్రభుత్వానికి 29.54 శాతం వాటా ఉంది. దీని విలువ సుమారు రూ.37,000 కోట్లుగా ఉంది. ఐటీసీలో 7.91 శాతం పెట్టుబడులున్నాయి. యూనిట్ ట్రస్ ్ట ఆఫ్ ఇండియా ద్వారా ఐటీసీలో పెట్టుబడులను పెట్టింది. ఇప్పుడీ రెండింట్లోనూ వంద శాతం మేర తన వాటాలను ఉప సంహరించుకోవాలని కేంద్రం ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ రెండింటినీ ప్రైవేటీకరించడం ద్వారా.. కనీసం రూ.65,000 కోట్ల నుంచి రూ.70,000 కోట్లను సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే ఎయిరిండియా, ఎల్‌ఐసీ ప్రైవేటుపరం
గత ఆర్థిక సంవత్సరంలో ఎయిరిండియా, జీవిత బీమా సంస్థల్లో తన పెట్టుబడులను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పవన్ హన్స్ లిమిటెడ్ నుంచి తన వాటాలను విక్రయించుకోవడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంది. ఇది వరకే స్టార్9 మొబిలిటీ బిడ్డింగ్‌కు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ ్టమెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (దీపం) ఆమోదం తెలిపినప్పటికీ.. దీన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎల్‌ఐసీని కూడా ప్రైవేటీకరించింది. పబ్లిక్ ఇష్యూ జారీ చేయగా.. బోల్తా పడింది. రూ.21,000 కోట్లను సేకరించుకోవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లింది. కానీ రూ.20,500 కోట్లు మాత్రమే సమకూరాయి. పైగా స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ సమయంలో ప్రైస్ బ్యాండ్ కంటే 8 శాతం తక్కువకే లిస్టింగ్ అయ్యింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..