తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు టీచర్లు రోడ్డెక్కారు. ఈనెల 30వ తేదీలోగా స్కూల్స్ తెరవకపోతే నిరవధిక దీక్ష చేస్తామని హెచ్చరించారు. సినిమా థియేటర్లు, బార్లలకు లేని కరోనా స్కూల్ లకు మాత్రమే వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. స్కూలు తెరవకపోతే బార్లకు లకు ఉన్న లైసెన్సులను తమకు ఇప్పించాలని హైదరాబాద్ కలెక్టరేట్ ఎదురుగా నిరసనకు దిగారు.
ఒక్క హైదరాబాద్ లోనే కాకుండా జనగాం, సూర్యాపేట ఇలా చాలా ప్రాంతాలలో ప్రైవేటు టీచర్లు ఆందోళనకు దిగుతున్నారు. ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోకపోతే ఈ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.కాగా కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువవుతున్న నేపథ్యంలో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.