Friday, November 22, 2024

Private Jet | రన్​వేపై ప్రైవేట్​ జెట్ క్రాష్​ ల్యాండ్​​.. ప్రయాణికులు సేఫ్​!

ముంబై విమానాశ్రయం రన్​వేపై ఓ ప్రైవేట్​ జెట్​ క్రాష్​ ల్యాండ్​ అయ్యింది. విశాఖ నుంచి ముంబైకి వెళ్లిన ఈ ప్రైవేట్​ విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. “VSR వెంచర్స్ లీర్‌జెట్ 45 ఎయిర్‌క్రాఫ్ట్ VT-DBL వైజాగ్ నుండి ముంబైకి వెళ్తోంది.ఈ ఆపరేటింగ్ ఫ్లైట్ ముంబై విమానాశ్రయంలోని రన్‌వే 27లో ల్యాండ్ అవుతున్నప్పుడు రన్‌వేపై జారిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. ముంబయి సిటీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకుందని, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.

దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజీని విమానశ్రయ సిబ్బంది రిలీజ్​ చేశారు. ల్యాండ్ అవుతున్న క్రమంలో ఈ విమానం నేలను ఢీకొట్టింది. క్రాష్ ల్యాండింగ్ తర్వాత విమానం చుట్టూ తెల్లటి పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  క్రాష్ తర్వాత శిధిలాలు స్పాట్ నుండి క్లియర్ చేశారు. DGCA క్లియరెన్స్ తర్వాత రన్​వే మళ్లీ ఓపెన్​ చేశారు. ముంబై రన్‌వే వద్ద ప్రైవేట్ జెట్ క్రాష్ ల్యాండ్ అయిన తర్వాత కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరికొన్నిటిని దారి మళ్లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement