Friday, November 22, 2024

పది విద్యార్థులకు కార్పోరేట్‌ వల!

ప్రభ న్యూస్‌ : ఏ తల్లిదండ్రులైనా పిల్లలకు ఉన్నత భవిష్యత్తు అందించేందుకు తపన పడుతుంటారు. ఎంత కష్టమైనా, ఖర్చయినా.. నాణ్యమైన విద్యనందించాలని కోరుకుంటారు. వారి ఆరాటాన్ని సొమ్ము చేసుకుంటున్నాయి కార్పోరేట్‌ కళాశాలలు, ‘మా కాలేజీలో చేర్పిస్తే మీ పిల్లలు ఇలా.. అలా.. అవుతారు అంటూ మభ్య పెడుతున్నారు. ఇప్పుడే ఆడ్మిషన్‌ తీసుకుంటే ఇంత శాతం తగ్గుతుందని ప్యాకేజీల పేరిట కోర్సుకో రేటు కడుతూ ఇంటి వద్దే ఆడ్మిషన్లు తీసుకుంటున్నారు. విద్యార్థులకు ఇష్టమైన కోర్సు కాకుండా వారు చెప్పిన కోర్సులోనే జాయిన్‌ చేసి వారి భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. పదో తరగతి పరీక్షలు ముగిశాయి. అప్పుడే లెక్చరర్లు, పీఆర్‌వోలు ఊళ్లపై వాలిపోతున్నారు.

అయితే తల్లిదండ్రులు తొందరపడి పిల్లల భవిష్యత్తును నాశనం చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి కాలేజీల్లో చేరితే తర్వాత ఎవరూ పట్టించుకోరని పేర్కొంటున్నారు. ముందుగా విద్యార్థుల అభిప్రాయం, సదరు కళాశాలలో విద్య నాణ్యత, బోధన చేస్తున్న వారి అనుభవం అంశాలను కళాశాలకు చెందిన సీనియర్‌ విద్యార్థులను తెలుసుకున్న తర్వాతే ఆడ్మిషన్‌కు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement