Tuesday, November 19, 2024

షూటింగ్ లో సలార్ విలన్ కు గాయాలు – మూడు నెలలు బెడ్ రెస్ట్

కోలీవుడ్ సూపర్ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ షూటింగ్ సెట్స్ లో ప్రమాదం బారిన పడ్డారు. విలాయత్ బుద్ధ టైటిల్ తో తెరకెక్కుతున్న చిత్రం లో పృథ్విరాజ్ హీరో కేరళ ఆర్టీసీ బస్సులో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా పృథ్విరాజ్ బస్సులో నుండి జారిపడ్డారు. ఆయన కాలికి తీవ్ర గాయమైంది. మరయూర్ బస్ స్టాండ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే పృథ్విరాజ్ ని కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

.పరీక్షలు నిర్వహించిన వైద్యులు సర్జరీ చేయాలని సూచించారు. నేడు పృథ్విరాజ్ కాలికి సర్జరీ చేయనున్నారట. మూడు నెలల పాటు ఆయన బెడ్ రెస్ట్ తీసుకోవాలని తెలుస్తుంది. ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన పృథ్విరాజ్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement