Thursday, September 12, 2024

Prithvi – 2 మిసైల్ టెస్ట్ స‌క్సెస్

ఒడిశా నుంచి ప్ర‌యోగం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – చాందీపూర్ : న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఈ క్షిపణిని ప్రయోగించారు. పృథ్వీ-2 ఈ వెర్షన్‌ను డీఆర్ డీవో తయారు చేసింది. ఈ క్షిపణి 350 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. పృథ్వీ-2 అనేది దేశంలో అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణి. దానితో పాటు ఆయుధాలను కూడా మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. అంతకుముందు కూడా ఒడిశా తీరం నుంచి వ్యూహాత్మక బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ను విజయవంతంగా పరీక్షించారు.

గతేడాది జనవరిలో ఈ పరీక్ష జరిగింది. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ-2ను విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అప్పట్లో ప్రకటించింది. పృథ్వీ-2 క్షిపణి భారతదేశ అణ్వాయుధాల్లో ముఖ్యమైన భాగం. పృథ్వీ-2 క్షిపణి పరిధి 350 కిలోమీటర్లు. పృథ్వీ-2 క్షిపణి చాలా ఎక్కువ స్థాయి ఖచ్చితత్వంతో లక్ష్యాలను చేధించగలదు. ఉపరితలం నుండి ఉపరితలం వరకు 350న్నర కిలోమీటర్లు కొట్టగల సామర్థ్యం. తొమ్మిది మీటర్ల పొడవున్న పృథ్వీ క్షిపణి 2003 నుంచి సైన్యంలో ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement