Tuesday, November 26, 2024

ప్రిస్మోస్‌ బ్యూటీ ప్రోడక్ట్‌, శ్రీరూప్‌ కాస్మోస్యూటికల్స్‌ ఆవిష్కరణ.. త్వరలో ఈ-కామర్స్ లో అమ్మకాలు

శ్రీరూప్‌ కాస్మోస్యూటికల్స్‌ ఎల్‌ఎల్‌పీ.. స్కిన్‌ కేర్‌ ప్రోడక్ట్స్ ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ప్రిస్మోస్‌-బ్యూటీ పేరుతో పలు సౌందర్యపరమైన ఉత్పత్తులను లాంచ్‌ చేసేందుకు నిర్ణయించినట్టు ప్రముఖ కాస్మోటిక్‌ సర్జన్‌, ప్రాక్టీషినర్‌ అండ్‌ కాస్మోటలజిస్టు డాక్టర్‌ రాజశేఖర్‌ గొల్లు తెలిపారు. తన భాగస్వామి, బిజినెస్‌ పార్టనర్‌ డాక్టర్‌ లీల సరస్వతి గొల్లుతో కలిసి ప్రారంభిస్తున్నట్టు వివరించారు. బ్రెజిల్‌, ఫిలిపిన్స్‌తో పాటు థాయ్‌లాండ్‌లో కాస్మోటిక్‌లో శిక్షణ పొందినట్టు తెలిపారు. స్కిన్‌, హెయిర్‌తో పాటు వెల్‌నెస్‌ పరమైన సమస్యల పరిష్కారానికి ప్రిస్మోస్‌ బ్యూటీ ప్రోడక్ట్స్‌ ఎంతో ఉపయోగపడుతాయన్నారు. థాయ్‌లాండ్‌, ఇండియాలోని ట్రయికలాజిస్టులు, డెర్మటాలొజిస్టులు, బ్రెజిల్‌, ఫిలిపిన్స్‌లోని కాస్మొటలాజిస్టులు, కేరళలోని ఆయురేద నిపుణులతో చర్చించిన తరువాత.. ప్రిస్మోస్‌ బ్యూటీ ఉత్పత్తులు తీసుకొచ్చినట్టు తెలిపారు.

సహజ సిద్ధమైన ప్రోడక్టులతో.. స్కిన్‌, హెయిర్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. బ్యూటీ కేర్‌ ఇండస్ట్రీలో తమ కంటూ స్థాయిని సంపాధించుకోవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని డాక్టర్‌ లీలా సరసతీ గొల్లు తెలిపారు. ఈ బ్యూటీ ప్రోడక్టులను సినీ నటి హిమజ, సినీ నటుడు గిరిధర్‌తో కలిసి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజశేఖర్‌, మేనేజింగ్‌ పార్టనర్‌ డాక్టర్‌ జి.లీల సరస్వతీలు విడుదల చేశారు. త్వరలో ఈ ఉత్పత్తులు అన్ని ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలో లభిస్తాయని, అమెజాన్‌, నైకా, మింత్రా వంటి వేదికల్లో కూడా కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement