Friday, November 22, 2024

ఎయిర్‌పోర్టుల్లో ప్రిస్మా ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్ సిస్ట‌మ్‌..

హైదరాబాద్‌, (ప్రభ ప్రతినిధి) : అహ్మదాబాద్‌లోని అదానీ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమర్‌ అనుభవాన్ని మెరుగుపరచడానికి కంప్యూటర్‌ విజన్‌ టెక్నాలజీని అందించడంలో అగ్రగామిగా ఉన్న ప్రిస్మా ఏఐతో అదానీ గ్రూప్‌ భాగస్వాములు. ప్రస్తుతం ఈ సర్వీస్‌ డిపార్చర్‌ ఏరియాలు, ప్రీ సెక్యూరిటీ ఏరియాలను కవర్‌ చేస్తూ, దేశీయ టెర్మినల్‌ (టీ-1) యొక్క డిపార్చర్‌ ఏరియా వద్ద ఎస్వీపీఐఏలో అమలు చేస్తున్నారు. డెస్క్‌ ఆఫ్‌ గుడ్నెస్‌ సిస్టమ్‌ అనే సాంకేతికత మిగిలిన ఆరు అదానీ విమానాశ్రయాలలో అమలు చేస్తున్నారు.

త్వరలో వినియోగానికి అందుబాటులో ఉంటుంది. అదానీ గ్రూప్‌, బహుళజాతి సమ్మేళనం 2019లో విమానాశ్రయ రంగంలోకి ప్రవేశించింది. ప్రిస్మా ఏఐ యొక్క విజువల్‌ ఏఐ సాంకేతికతతో, అదానీ గ్రూపునకు చెందిన అన్ని విమానాశ్రయాలు అత్యాధునిక విజువల్‌ టెక్నాలజీని కలిగి ఉంటాయి. సృజనాత్మకత, ధైర్యం, భద్రత ప్రిస్మా ఏఐ అందించిన భాగస్వామ్యం, విజువల్‌ ఏఐ సాంకేతికత, కస్టమర్‌ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement