Saturday, November 23, 2024

దేశంలోనే తెలంగాణ అటవీశాఖకు ప్రాధాన్యత : డోబ్రియల్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత ప్రాధాన్యత అటవీశాఖకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, హెడ్‌ ఆఫ్‌ ఫారెస్టు ఫోర్స్‌ ఆర్‌. ఎం. డోబ్రియల్‌ అన్నారు. పర్యావరణ ప్రాధాన్యతను గుర్తించిన సిఎం కేసీఆర్‌ అడవుల రక్షణకు జంగల్‌ బచావో – జంగల్‌ బడావో నినాదం తీసుకొచ్చారని గుర్తు చేశారు. గురువారం అరణ్యభవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి.

ఈ సందర్బంగా డోబ్రియల్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణహిత తెలంగాణ సాధనలో అటవీశాఖ భాగం కావడం, దేశంలోనే ప్రసంశలు పొందుతున్న పథకాల్లో తెలంగాణకు హరితహారానికి చోటు లభించడం గర్వకారణమన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాల్లో హరితహారం ఉండటం, ఆ బాధ్యతను అటవీశాఖ చేపట్టడం గొప్ప విషయం అని అన్నారు. పచ్చదనం లక్ష్యం 33 శాతం సాధించే వరకు నిబద్ధతతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement