Tuesday, November 26, 2024

AP Budjet | విద్య, వైద్యం, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం.. ఏపీ బడ్జెట్​లో కేటాయింపులు ఇలా..

ఏపీ అసెంబ్లీలో ఇవ్వాల (గురువారం) ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి బడ్డెట్ ప్రవేశపెట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఎన్నడూ లేనంత స్ధాయిలో రూ.2.79 లక్షల కోట్లతో ఈ బడ్డెట్ ను బుగ్గన ప్రవేశపెట్టారు. ఇందులో ఎప్పటిలాగే విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. ఏపీలో బడ్జెట్​ ప్రవేశానికి ముందు ముఖ్యమంత్రి ఆశీస్సులు, అనుమతి తీసుకున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఎస్​ ఎస్​ రావత్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ ఉన్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

ఏపీలో వచ్చే ఆర్ధిక సంవత్సరానికి వైసీపీ సర్కార్ 2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించింది. ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో రూ.2 లక్షల 79 వేల 279 కోట్లతో ఈ బడ్డెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో గతంలో మాదిరిగానే పలు కీలక రంగాలకు భారీ కేటాయింపులు చేశారు. ఇందులో విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాల పథకాలకు ఇందులో పెద్ద మొత్తంలో కేటాయింపులున్నాయి. గతంతో పోలిస్తే ప్రతీ శాఖకూ కేటాయింపులు పెంచినట్టు స్పష్టమవుతోంది.

బడ్జెట్‌లో కేటాయింపులు గమనిస్తే… వైఎస్సార్​ పెన్షన్ కానుకకు రూ.21,434.72 కోట్లు, వైఎస్సార్​ రైతు భరోసాకు రూ.4,020 కోట్లు, జగనన్న విద్యా దీవెనకు రూ.2,841.64 కోట్లు, జగనన్న వసతి దీవెనకు రూ.2,200 కోట్లు, వైఎస్సార్​-పీఎం బీమా యోజనకు రూ.1600 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు కేటాయించారు. వైఎస్పార్​ కాపు నేస్తానికి రూ.550 కోట్లు ఇచ్చారు. జగనన్న చేదోడు రూ.350 కోట్లు కేటాయించారు.

- Advertisement -

వైఎస్సార్​ వాహనమిత్ర రూ.275 కోట్లు, వైఎస్సార్​ నేతన్న నేస్తం రూ.200 కోట్లు, వైఎస్సార్​ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు, మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ రూ.50 కోట్లు, రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు, లా నేస్తం రూ.17 కోట్లు, జగనన్న తోడు రూ.35 కోట్లు, ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు, వైఎస్సార్​ కల్యాణమస్తు రూ.200 కోట్లు, వైఎస్సార్​ ఆసరా రూ.6700 కోట్లు, వైఎస్సార్​ చేయూత రూ.5000 కోట్లు, అమ్మ ఒడి రూ.6500 కోట్లు కేటాయించారు. ఈ లెక్కన మొత్తంగా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు రూ.54,228.36 కోట్లు కేటాయించినట్టు స్పష్టమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement