Tuesday, January 7, 2025

TG | మ‌హిళ‌ల‌కు అన్ని రంగాల్లో ప్రాధాన్యం.. మంత్రి పొన్నం

సావిత్రి భాయి పూలేకు ఘ‌న నివాళులు
ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సిద్ధిపేట : మ‌హిళ‌ల‌కు అన్ని రంగాల్లో ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. గురువారం అక్కన్నపేట మండల కేంద్రంలో భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పులే 194వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. మహిళలు చదువుకోవాలని, సమాజంలో స‌గం మంది ఉన్న మ‌హిళ‌లు కూడా కీల‌క భాగ‌స్వామ్యం కావాల‌ని ఆమె పిలుపునిచ్చార‌ని గుర్తు చేశారు. ఆమె జ‌యంతి సంద‌ర్భంగా తెలంగాణ ప్రభుత్వం గౌర‌విస్తూ.. మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింద‌న్నారు.

అన్ని రంగాల్లో భార‌త మ‌హిళ‌ల పోటీ..
సావిత్రి భాయ్ పులే మార్గదర్శకత్వంలో భార‌త దేశ మ‌హిళ‌లు ప్ర‌పంచంలోని అన్ని రంగాల్లో పోటీ ప‌డుతున్నార‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు , మహిళా సంఘాల పటిష్ఠం, కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయడం త‌మ‌ ప్రభుత్వం లక్ష్యమ‌న్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement