హైదరాబాద్, ఆంధ్రప్రభ: నీటివనరుల సంరక్షణతో పాటుగా దేవాలయాల సంరక్షణ, నిర్మాణాల్లో కాకతీయుల ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతాలను సృష్టిస్తుంది. మిషన్ కాకతీయతో చెరువుల పునురుద్ధరణ, రిజర్వాయర్ల నిర్మాణంతో భూగర్భజలవనరులను 680 టీఎం సీలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం టెంపుల్ టూరిజానికి ప్రాధాన్యత ఇస్తుంది. జోగులాంబ ఆలయాన్నితీర్చి దిద్దేందుకు నిధులు కేటాయించింది. తుంగభద్ర కృష్ణా నదీ సంగమించే ప్రాంతంలో బాదామిచాళుక్యుల నిర్మించిన జోగులాంబ శక్తి పీఠం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక విలువలు పొంపొందిస్తూ పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది.
దేశంలో ఉన్న నవబ్రహ్మాలయాలు ఇక్కడమాత్రమే ఉన్నాయి. పద్దెనిమిదిఅష్ఠదశ పీఠాల్లో ఒకటిగా భక్తులకు దర్శనమిస్తున్న ఈ ఆలయానికి దేశంలోని అనేక ప్రాంతాలనుంచి భక్తులు వస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల రూపకల్పనతో పాటుగా భక్తులకు అనేక సౌకర్యాలను మెరుగుపర్చింది. అలాగే కేంద్ర పర్యాటకశాఖ ప్రసాద్ (తీర్థ యాత్ర పునరుజ్జీవన అడ్వాన్స్) పథకంలో చేర్చి అభివృద్ధి పనులను ప్రారంభించింది.
క్రీ.శ. 1390లో బహుమనీ సుల్తాల దండయాత్రలో ఆలయం ధ్వంసం అయింది. ఆపురూపమైన పరివార దేవత విగ్రహాలను ధ్వంసం చేశారు. విజయనగర చక్రవర్తి రెండవ హరిహర రాయలు బహుమనీసైన్యంతో పొరాడి దాడులను అడ్డుకోవడంతో పాటుగా దేవాదాయ సముదాయాన్ని భద్రపరిచారు. అయితే భక్తులు మూలవిరాట్ విగ్రాహాలైన జోగులాంబ, శక్తి సవరూపాలైన చండీ, ముండీలను సమీపంలోని నవబ్రహ్మ ఆలయానికి తరలించి దాచిపెట్టారు. 6వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంఆనేక దాడులను ఎదుర్కొంది.
ప్రధానంగా 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనం అనంతరం మొఘలులు బహుమనీ సుల్తానులు ఆలయాల ధ్వంసానికి ఒడిగట్టగా స్థానిక పాలకులు, సంస్థానాధీశులు ప్రాణాలను పణంగా పెట్టి కాపాడినవి నేటికి మిగిలిఉన్న ఆలయాలు. రాయల సీమ ముఖద్వారం కర్నూలుకు సమీపంలో పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోని అలంపూర్ పట్టణంజోగులాంబ ఆలయ నిర్మాణం జరిగింది.
రాష్ట్రంలోని అతిపురాతన ఆలయాల్లో ఈ ఆలయానికి ప్రత్యేకత ఉంది. రెండవపులకేశీ ఇక్కడ పూజలు చేసినట్లు చరిత్రకారులుచెపుతారు, ఆలయ గోపురాలు, స్థంభాలు, మంటపాలు చాళుక్య శిల్పకళకు ప్రతీకగా నిలిచింది. అయితే చాళుక్యుల అనంతరం కాకతీయ రాజులు ఆలయ అభివృద్ధికోసం అనేక పునర్ నిర్మాణ పనుల్లో భాగస్వాములయ్యారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పర్యాటకులను, భక్తులను, చరిత్ర పరిశోధకులను ఆకట్టుకునేలామౌలికసదుపాయాలు కల్పించింది. అయితే ప్రస్తుతం ప్రసాద్ పథకంతో రూ.36.73 కోట్లు.
సమానంగా రాష్ట్ర ప్రభుత్వంనిధులు కేటాయించి టెంపుల్ టూరిజాన్ని పెంపొందిస్తున్నారు. యాత్రికుల సౌకర్యాల కోసం కల్చర్ హాట్, పార్కింగ్, సీసీటీవీ కెమెమెరాలు, బోట్లు, జెట్టీలు ప్రయాణ ప్రాంగణాల నిర్మాణాలు చేపట్టారు. జోగులాంబ ఆలయ మౌలిక సదుపాయాలతోపాటుగా రాష్ట్రంలోని పలు ప్రాచీన ఆలయాల పునరుద్ధరణ కోసం తెలంగాణ చేస్తున్న ప్రయత్నం ఫలిస్తే టెంపుల్ టూరిజానికి తెలంగాణ కేంద్రంగా మారనుందని పలువురుబావిస్తున్నారు.