Thursday, November 21, 2024

నవంబర్ 12న పెద్ద‌ప‌ల్లి జిల్లాకు ప్రధాని రాక..

  • ఆర్ ఎఫ్ సీఎల్ జాతికి అంకితం.. చురుగ్గా ఏర్పాట్లు

పెద్ద‌ప‌ల్లి : భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ నవంబర్ 12న తెలంగాణకు రానున్నారు. పెద్దపెల్లి జిల్లా రామగుండంలో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని పర్యటన కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శనివారం కేంద్ర ఎరువుల రసాయన శాఖ కార్యదర్శి అరుణ్ సింఘాల్, పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం ఎన్టిపిసి సీజీఎం సునీల్ కుమార్, రామగుండం ఎరువుల కర్మాగారం జీఎం జా, ఎన్టిపీసీ పర్మినెంట్ టౌన్షిప్ లోని మహాత్మా గాంధీ స్టేడియంలోగల హెలిప్యాడ్ ను పరిశీలించారు. ప్రధాని సభ జరిగే ప్రాంగణంతో పాటు ఆర్ఎఫ్ సీఎల్ ఎరువుల కర్మాగారంలో ప్రధాని పర్యటన రూట్ మ్యాప్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీలు రూపేష్ కుమార్, అఖిల్ మహాజన్, రామగుండం మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, రామగుండం సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ కణతల లక్ష్మీనారాయణ, రామగుండం తాసిల్దార్ జహేద్ పాషా, ఆర్ ఎఫ్ సిఎల్ ఉన్నత అధికారులు, పలు విభాగాల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement