Thursday, November 21, 2024

బుద్ధపూర్ణిమ రోజు నేపాల్‌కు ప్రధాని.. లుంబినిని సంద‌ర్శించ‌నున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోడీ బుద్ధపౌర్ణమి సందర్భంగా ఈ నెల 16న నేపాల్‌లోని బుద్ధుడి జన్మస్థలం ‘లుంబిని’ని సందర్శించనున్నారు. నేపాల్‌తో ఉన్న బౌద్ధ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతోనే ఆయన ఈ పర్యటనకు వెళ్లనున్నారు. నేపాల్‌ ప్రధాని షేర్‌ బహదూర్‌ దేవ్‌బా ఆహ్వానం మేరకే మోడీ నేపాల్‌ వెళ్తున్నారు. 2021 అక్టోబర్‌లో మోడీ ఉత్తరప్రదేశ్‌ తూర్పు ప్రాంతంలోని కుషీనగర్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. బుద్ధుడు నిర్యాణం చెందిన ప్రాంతంలోని మహాపరినిర్వాణ ఆలయానికి జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్శించడానికే ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. 2016లో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన బుద్ధిస్టు సర్క్యూట్‌లో భాగంగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement