Saturday, November 23, 2024

మన్‌ కీ బాత్ @ 75

మ‌న్ కీ బాత్‌ 75 ఎపిసోడ్లు విజయవంతంగా పూర్తి చేసుకుందని ప్రధాని మోదీ తెలిపారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అటు దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75వసంతాలు పూర్తి కానున్నాయ‌ని, ఈ నేప‌థ్యంలో ‘అమృత్‌ మహోత్సవ్’ కార్యక్రమాన్ని చేప‌డుతున్నామ‌ని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేష‌న్‌ కార్యక్రమం భార‌త్‌లో కొన‌సాగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చెప్పారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జౌన్‌పూర్‌లో 109 ఏళ్ల వృద్ధురాలు వ్యాక్సిన్‌ తీసుకున్నారని, ఢిల్లీలో 107 ఏళ్ల వృద్ధురాలు కూడా వేయించుకున్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు. దేశ ప్ర‌జ‌ల్లో వారు స్ఫూర్తిని నింపార‌ని చెప్పారు. గ‌త ఏడాది మార్చిలో కరోనాను కట్టడి చేసేందుకు భార‌త్‌లో జనతా కర్ఫ్యూను చేపట్టామ‌ని, అందులో భారతీయులు క‌న‌బ‌ర్చిన‌ క్రమశిక్షణ ప్రపంచానికి ఉదాహరణగా నిలిచిందని తెలిపారు. దాన్ని భవిష్యత్‌ తరాలు గుర్తు పెట్టుకుంటాయని చెప్పారు.

దేశ‌ మహిళలు క్రీడలు, శాస్త్రీయ రంగాలతోపాటు ఇతర అన్ని రంగాల్లోనూ సత్తా చాటుతున్నారని మోదీ తెలిపారు. ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్‌ ప్రపంచ కప్‌లో భారత్‌ ఉన్నత స్థానం సాధించిందని చెప్పారు. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న భారత క్రికెటర్‌ మిథాలీరాజ్‌కు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. అటు బ్యాడ్మింటన్‌ స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నీలో రజత పతకం సాధించిన పీవీ సింధుకు అభినందనలు చెప్పారు. సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తోన్న సామాజ‌కిమ కార్య‌క‌ర్త‌ల‌ను, ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల‌ను మోదీ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement